రైతుల కన్నీళ్లు తుడిచేదెవరు
పాలమూరు : ఏటా ప్రతికూల వాతావరణ పరిస్థితలు మధ్య సాగుచేసిన పంటలు చేతికందుతాయనే నమ్మకం లేకుండాపోయింది. చేసిన అప్పులు తీరే మార్గం లేక నాలుగేళ్లుగా జిల్లాలో 440మంది అన్నదాతల ఆత్మహత్యలకు పాల్పడ్డారు.ఏటా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో జిల్లాను కరువు పరిస్థితులు పట్టి పీడిస్తున్నాయి.దీంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు క్షోభకు గురౌతున్నారు.ఈ పరిస్థితుల్లో బలవన్మరణానికి ఒడిగడుతున్నారు.దీంతో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన బాధిత కుటుంబాలు వీధిపాలవుతున్నారు.