కొత్త రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ

 

 

 

 

పిట్లం సెప్టెంబర్ 07 (జనం సాక్షి)పిట్లం మండలంలోని ధర్మారం గ్రామంలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసినట్లు రేషన్ డీలర్ గురునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు భరించాము అని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు