విద్యుదాఘాతానికి ముగ్గురు మృతి
పాల్వంచ రూరల్, అక్టోబర్1 (జనంసాక్షి) : విద్యుదాఘాతానికి ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాతపడ్డ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కారెగట్టుకు చెందిన మాడె తిరుపతమ్మ (40), ఆమె కొడుకు మహేశ్(20), మరిది కోరెం లక్ష్మయ్య (40) మంగళవారం పొలానికి వెళ్తుండగా మంచె పక్కన నడుస్తున్న లక్ష్మయ్య తలకు కరెంటు వైరు తగిలింది. దాన్ని అడ్డు తొలగించుకునేందుకు పట్టుకోగా తీగతో సహా కిందపడిపోయాడు. ఆయనను లేపేందుకు మహేశ్ ప్రయత్నించగా అతను కూడా షాక్‌కు గురై పడిపోయాడు. వారిద్దరిని లేపేందుకు తిరుపతమ్మ ప్రయత్నించగా షాక్‌కు గురై… ముగ్గురూ మృతిచెందారు.