కబినేట్‌ ఆమోదం అమరవీరులకు అంకితం : హరీష్‌రావు

మెదక్‌ : తెలంగాణ కేబినేట్‌ ఆమోదం తెలంగాణ అమరవీరులకు అంకితమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టే వరకు ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌పై పూర్తి అధికారాలు తెలంగాణ ప్రజలకే ఉండాలన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు సంయమనం పాటించి సమ్మె విరమించాలని కోరారు. బంద్‌లతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరుతుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరవాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. తెలంగాణ వచ్చినంక అమరవీరుల కుటుంబం నుంచి ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే పైలుపై తొలి సంతకం పెడ్తామని తెలిపారు.