కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

జడ్చర్ల : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గోపాలపూర్‌ గ్రామంలో చెరువులో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను గ్రామానికి చెందిన రాములమ్మ(60), ఆమె కూతుళ్లు యాదమ్మ (40),మంగమ్మ (30)లుగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. సమాచారమందుకున్న జడ్చర్ల సీఐ వెంకటరమణ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.