70వేల మంది అంగన్‌వాడీలు, హెల్పర్లకు గుడ్ న్యూస్
హైదరాబాద్ : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండిరగ్ బిల్లులను సైతం విడుదల చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలను ఆదివారం నాడు మంత్రి హరీశ్‌రావు వెల్లడిరచారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్‌వాడీల జీతాలు పెంచుతామని హామీనిచ్చారు. మిగిలిన డిమాండ్లకు సంబంధించిన నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలోని 70వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందనున్నారు.