తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటను జిల్లా కేంద్రం చేస్తాం : కేసీఆర్‌

మెదక్‌ : తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటను జిల్లా కేంద్రంగా మార్చుతామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇవాళ ఆయన విలేరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటైనాక సిద్దిపేటను సస్యశ్యామలంగా మార్చుతామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ప్రజల మద్దతు , పోరాటం ఎన్నటికి మరిచిపోలేనని ఆయన పేర్కొన్నారు. కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దయవల్లే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని ఆయన తెలిపారు.