చికిత్స పొందుతూ బాలింత మృతి
కోస్గి : మహబూబ్‌నగర్‌జిల్లా కోస్గి మండలం లోని బోగారం గ్రామానికి చెందిన ముణెమ్మ కోస్గిలోని ప్రైవేట్ నర్సింగ్ హోంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మూడు రోజుల క్రితం పాపకు జన్మనిచ్చిన ముణెమ్మ అస్వస్థతకు గురైంది. దీంతో కోస్గి నుంచి రంగారెడ్డి జిల్లా తాండూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలింత మృతి చెందినట్లు వైద్లులు ధ్రువీకరించారు., దీంతో ఆగ్రహించిన ముణెమ్మ బంధువులు కోస్గిలోని నర్సింగ్ హోం వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు.