ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న బంద్
ఖమ్మం : భద్రాచలం డివిజన్‌కు తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఖమ్మం జిల్లా బంద్‌కు ఇవాళ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో బంద్ స్వచ్చందంగా కొనసాగుతోంది. అన్ని ఆర్టీసీ బస్ డిపోల ఎదుట అఖిలపక్షం నేతలు ధర్నా చేస్తున్నారు. దుకాణాలు మూతపడ్డాయి. ప్రైవేటు పాఠశాలలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నాయి. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి.