రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
మెదక్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. టాటాఏస్‌ను మహారాష్ట్ర ట్రావెల్‌స బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన విధ్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.