మెడికల్ షాపు యజమాని కిడ్నాప్
రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్‌లోని ఓ మెడికల్ షాపు యజమానిని కిడ్నాప్ చేశారు. క్వాలిస్ వాహనంలో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికుల కథనం ప్రకాం, రాజేంద్రనగర్ సర్కిల్ నందిముస్లాయిగూడకు చెందిన నర్సింహారెడ్డి మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో షాపు వద్దకు వచ్చిన నలుగురు వ్యక్తులు టాస్క్‌పోర్స్ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించారు. షెట్టర్‌ను మూసివేసి పది నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం నర్సింహారెడ్డిని వారు వచ్చిన వాహనంలో తీసుకెళ్లారు. ఎంతకి ఇంటకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.