ట్రిబ్యునల్‌ తీర్పు పాపం కాంగ్రెస్‌, వైఎస్‌లదే

హైదరాబాద్‌: బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు పాపం కాంగ్రెస్‌, వైస్‌ రాజశేఖరరెడ్డిలదేనని తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమ ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పలు ఆందోళనలు చేసినా వైఎస్‌ ఖాతరు చేయలేదన్నారు. రాష్ట్రం తరఫున సరైన వాదనలు వినిపించాలని ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా కనీసం స్పందించలేదని, ఆ ఫలితంగానే రాష్టానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో చురుగ్గా వ్యవహరిస్తున్న కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, జయరాం రమేశ్‌లు ఆంధ్రప్రదేశ్‌ పై కక్ష గట్టి తమ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేశారని ఉమ ఆరోపించారు.