శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

3న ప్రత్యేక కేబినెట్‌
అదే రోజు ఆమోదం
వెనువెంటనే రాష్ట్రపతికి, అసెంబ్లీకి
కోర్‌కమిటీ మెజార్టీ సభ్యులు మొగ్గు
న్యూఢిల్లీ, నవంబర్‌ 29 (జనంసాక్షి) :
శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఈమేరకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రధాని నివాసంలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం ముగిసింది. గంటపాటు సాగిన ఈ సమావేశానికి సభ్యులందరూ హాజరయ్యారు. సమావేశం పూర్తికాకుండానే కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ బయటికి వచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విభజన బిల్లు ఆమోదానికి ఉన్న సాధ్యాసాధ్యాలను కోర్‌కమిటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేవాల్లోనే బిల్లు వచస్తుందని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. మొత్తానికి వివిధ అంవాలను చర్చించి బిల్లు తీసుకుని రావడానికి అంగీకరించారు. తెలంగాణ అంశంపై నిమిషానికో మాటతో గందరగోళం సృష్టిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఈ విషయమై మరింత స్పష్టత కోసం కోర్‌ కమిటీలో చచ్చింది. ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో కోర్‌ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాయల తెలంగాణ, హైదరాబాద్‌ అంశాలపైనే చర్చించి ఉంటారని భావిస్తున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన ఏమాత్రం లేదని చెబుతున్నా, ఈ నగరం విషయంలో ఏం చేయాలన్న నిర్ణయం మాత్రం ఇంతవరకు తీసుకోలేకపోయారు. అందుకే దీని గురించి ఈ భేటీలో ముమ్మరంగా చర్చించారు.ఇక విభజన గురించి ప్రభుత్వపరంగా నియమించిన కేంద్ర మంత్రివర్గం (జీవోఎం) రూపొందించిన నివేదికకు కూడా కోర్‌ కమిటీ రాజకీయ పరంగా క్లియరెన్స్‌ ఇవ్వనుంది. వీటితో పాటు పార్లమెంటు శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టాలన్న విషయంపై కూడా ఈ కోర్‌ కమిటీ భేటీలోనే చర్చించారు. డిసెంబర్‌ 3న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రత్యే కేబినెట్‌ సమావేశం ఉంటుందని కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. తెలంగాణ బిల్లు, మంత్రుల బృందం నివేదికపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. అదేరోజు కేబినేట్‌లో ఆమోదం దక్కాక బిల్లు రాష్ట్రపతికి వెలతుతుందన్నారు. అలాగే హైదరాబాద్‌పై ఉన్న అన్ని ఆప్షన్లు తెలుపుతామని, దానిపై అంతిమ నిర్ణయం కేబినెట్‌ తీసుకుంటుందని షిండే చెప్పారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా శాంతిభద్రతలు పరిపాలన అంశాలను గవర్నర్‌కు కేటాయించడంపై తెలంగాణ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తమ ఆస్తులపై దాడులు జరుగుతాయని సీమాంధ్ర నేతలు భయపడుతున్నారని చెప్పారు.
దిగ్విజయ్‌సింగ్‌తో జైరాంరమేశ్‌ భేటీ
తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ ¬ం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేతో సమావేశమయ్యారు. వారిద్దరు కూడా ¬ం శాఖ కార్యదర్శితో మాట్లాడారు. దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో ¬ం కార్యదర్శితో జైరాం రమేష్‌, సుశీల్‌కుమార్‌ షిండే మాట్లాడారు. ఆ తర్వాత జైరాం రమేష్‌ కాంగ్రెస్‌ ఆంధప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. జివోం నివేదిక పూర్తియిన సందర్భంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా జైరాంరమేశ్‌ జీఓఎం రిపోర్ట్‌పై నివేదికను సమర్పించారు. కోర్‌కమిటీలో జీవోఎం రిపోర్టు, డ్రాఫ్ట్‌ బిల్‌పై చర్చ జరుగనుందన్న సమాచారం ఉండడంతో అంతకు ముందే డిగ్గీతో పాటు జైరాంరమేశ్‌, షిండేతో కేంద్ర ¬ం సెక్రటరీ సమావేశమయ్యారు. జీవోఎం నివేదికపై, తెలంగాణ బిల్లు ముసాయిదా రూపకల్పనపై శుక్రవారం సాయంత్రం కాంగ్రెసు కోర్‌ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. జివోఎం నివేదికను కోర్‌ కమిటీ సమావేశంలో పెట్టే అవకాశాలున్నాయి. రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెసు కోర్‌ కమిటీ సమావేశం జరుగుతుంది. కోర్‌ కమిటీ సభ్యులంతా అందుబాటులో ఉన్నారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రతిపాదించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. జివోఎం చివరి సమావేశం డిసెంబర్‌ 3వ తేదీన జరిగే అవకాశాలున్నాయి. తెలంగాణ ముసాయిదా బిల్లు డిసెంబర్‌ 4వ తేదీన కేంద్ర మంత్రివర్గం ముందుకు వస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతికి పంపించడం, రాష్ట్రపతి శాసనసభకు పంపించడం వంటి వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది.