కారు, పాలవ్యాను ఢీ: ఐదుగురి మృతి
ములుగు, మెదక్ జిల్లా: రాజీవ్ రహదారిపై మెదక్ జిల్లా ములుగు మండల కేంద్రం వద్ద ఆగి ఉన్న పాలవ్యానును ఇండికా కారు వెనక వైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారి వివరాలు. కారు డ్రైవర్ శ్రీనివాస్(సిద్ధిపేట), స్వామి(చిన్న కోడూరు) పద్మ, అక్ష్మి, మల్లవ్వ(వరంగల్ జిల్లా చేర్యాలమండలం)ఉన్నారు. కనకమ్మ ఆరోగ్యం బాగోక పోవడంతో గాంధీ ఆస్పత్రికని వీరంతా సిద్ధిపేట నుంచి బయల్దేరారు. కనకమ్మ పరిస్థితి ఇప్పుడు విషమంగానే ఉంది.