కాంగ్రెస్‌, భాజపాలకు ప్రత్యామ్నాయం ఉంటే బాగుండు

బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌
పాట్నా, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) :
సమర్ధమైన ప్రత్యామ్నాయం కనుక ఉన్నట్లయితే దేశప్రజలు ప్రధాన రాజకీయపక్షాలైన కాంగ్రెస్‌,భాజపాలు రెండింటింటిని తిరస్కరించడం ఖాయమని బీహర్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం వెల్లడైన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ విషయం నిరూపితమైందన్నారు. కేవలం ఏడాది క్రితమే ప్రారంభమైనా ఆమ్‌ఆద్మీపార్టీ అక్కడ28 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్‌,భాజపాలకు శృంగభంగం కలిగించిందని పేర్కొంటూ సరైన ప్రత్యామ్నాయం ఉంటే దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుందని చెప్పారు.భాజపానేతలు ప్రచారం చేస్తున్నట్లుగా దేశంలో మోడీప్రభంజనం వీచడం లేదని ఒకవేళ వీస్తున్నట్లయితే చత్తీస్‌గఢ్‌లోఅంత తక్కువా ఆధిక్యత ,ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనన్ని తక్కువ స్థానాలు ఆపార్టీకి వచ్చి ఉండేవి కావన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్నది కాంగ్రెస్‌వ్యతరేకతేనన్న నితీశ్‌ దాని ఆసరాగానే భాజపా కు ఈమాత్రం ఫలితాలు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు.అన్నా హాజారే అవినీతికి వ్యతిరేకంగా సాగించిన ఆందోళనా ఆప్‌ విజయానికి దోహదపడిందని, ఒక వేళ ఢిల్లీలో ఆపార్టీ ప్రభుత్వంఏర్పాటు చేయదల్చుకుంటే అక్కడి త మ ఏకైక శాసనసభ్యుడు మద్దతునిస్తారని ప్రకటించారు.భాజపాను మాత్రం సమర్దించే ప్రసక్తే లేదన్నారు. భవిష్యత్తులో బీహార్‌లోనూ భాజపా విజయం సాధించే అవకాశాలున్నాయాఅని ప్రశ్నించగా తానింతకు ముందే చెప్పినట్లుఆ పార్టీ గెలుపు కాంగ్రెస్‌ వ్యతిరేకతపైనే ఆధారపడిందని,కానీతమ రాష్ట్రంలో కాంగ్రెస్‌ వ్యతిరేకతపైనేఆధారపడి ఉంటుందని, కానితమ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నామమాత్రమే అయినందువల్ల భాజపాకు లభ్దిచేకూరే అవకాశం లేదన్నారు.నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంచుకోవడం భాజపా సరిదిద్దుకోలేని తప్పిదంచేసిందని పునరుద్ఠాటించారు.తృతియకూటమి ఏర్పాటుకుతానేమి ప్రయత్నించడం లేదని కాంగ్రెస్‌ – భాజపాయేతర పార్టీలు వేటితోనూ సంప్రదింపులు జరపడం లేదని చెప్పారు.