సీఎం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో అఖిల పక్ష సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి భారీ నీటి పారుదల శాఖామంత్రి సుదర్శన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తరఫున మండలి బుద్దప్రసాద్‌, కోదండ రెడ్డి, తెదేపాతరఫున కోడెల శివప్రసాద్‌ రావు, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, భాజపా నుంచి శేషగిరి రావు, నాగం జనార్ధన్‌ రెడ్డి, లోక్‌ సత్తా పార్టీ నుంచి జయప్రకాశ్‌ నారాయణ, తెరాస నుంచి వినోద్‌,, విద్యాసాగర్‌ రావ్‌ హాజరయ్యారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబునల్‌ తీర్పుపై అఖిల పక్ష సమావేశంలో చర్చించనున్నారు.