ఏన్‌యూలో జతీయ స్థాయి సాంకేతిక సదస్సు ప్రారంభం
హైదరాబాద్: గుంటూరు ఆచారకచ నాగార్జున విశ్వవిద్యాలయంలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో నేవిగేషన్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అంశంపై జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును రక్షణమంత్రిత్వశాఖ సాంకేతిక సలహాదారు అవినాష్ చందర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి వియన్నారావు లాంఛనంగా ప్రారంభించారు. ఇస్రో. షార్ శాస్త్రవేత్తలు, వివిధ రంగాల నిపుణులు సదస్సుకు హాజరయ్యారు.