షరతులు వర్తిస్తాయి ప్రజలు కోరుకుంటే సర్కార్‌ ఏర్పాటు చేస్తాం

మాకెందుకు మద్దతిస్తున్నారో కాంగ్రెస్‌, భాజపాలు చెప్పాలి
వారి అవినీతిపై విచారణ జరుపుతాం
అయినా సిద్ధమా : కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) :
ఢిల్లీ ప్రజలు కోరుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమ్‌ ఆద్మీ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. అయితే తమకు ఎందుకు మద్దతు పలుకుతున్నారో బీజేపీ, కాంగ్రెస్‌ స్పష్టం చేయాలని కోరారు. వారి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆయా ప్రభుత్వాల సమయంలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నుంచి వచ్చిన ఆహ్వానంతో ఆమ్‌ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం ఉదయం ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కలిశారు. అత్యధికంగా 32 సీట్లు సాధించిన బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత చూపడంతో ఢిల్లీలో 28 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆహ్వానించారు. తనకు పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన సూచించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి బేషరతుగా మద్దతిస్తామని కాంగ్రెస్‌ పార్టీ గవర్నర్‌కు లేఖ ఇచ్చిందని, కాంగ్రెస్‌ తీరు తమను విస్మయానికి గురి చేసిందన్నారు. నిజానికి తాము ఎవరినీ మద్దతు కోరలేదని, అలాగే తాము ఎవరికీ మద్దతు ఇస్తామనలేదన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్‌, బిజెపి రెండూ మద్దతిస్తామని చెబుతున్నాయి.. కానీ తాము అడగకుండానే ఎందుకు మద్దతిస్తున్నాయో స్పష్టం చేయాలని సోనియాగాంధీ, రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాసినట్లు కేజీవ్రాల్‌ చెప్పారు. ముఖ్యమంత్రి కావడానికో, అధికారం కోసమో తాము రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. అంశాల వారీగా స్పష్టత ఇస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లు, ఢిల్లీకి రాష్ట్ర ¬దా సహా పలు అంశాలపై మద్దతివ్వగలరా?.. ఢిల్లీలో విద్యుత్‌, తాగునీటి సమస్యలపై మాతో కలిసి వస్తారా అని ప్రశ్నించారు. అలాగే ఢిల్లీలో నీలటి మాఫియాపై విచారణక్‌ఉ అంగీకరిస్తారా అన్నది కూడా స్పష్టం కావాల్సి ఉందన్నారు. 15 ఏళ్లపాటు ఢిల్లీలో కాంగ్రెస్‌ పాలనపై విచారణకు మద్దతిస్తారా? అని నిలదీశారు. ఢిల్లీలో పొలాలు ఉన్నాయన్న సంగతి కూడా షీలాదీక్షిత్‌కు తెలియదన్నారు. తాము లేవనెత్తిన అంశాలపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్‌, బిజెపికు వారం రోజులు గడువు ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై అభిప్రాయం చెప్పేందుకు పది రోజులు సమయం కావాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కోరినట్లు కేజీవ్రాల్‌ చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆమ్‌ ఆద్మీ పార్టీకి అంశాల వారీ మద్దతు ఇవ్వడానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సిద్దంగా ఉన్నాయా లేదా అన్నది తెలియాలన్నారు. ఈ మేరకు ఆ పార్టీలకు అరవింద్‌ కేజీవ్రాల్‌ శనివారం లేఖాస్త్రం సంధించారు. సామాన్య పౌరుడిని దృష్టిలో ఉంచుకుని 18 అంశాలతో కూడిన లేఖను శనివారం ఆ రెండు పార్టీల అధ్యక్షులు సోనియా, రాజ్‌నాథ్‌ సింగ్లకు లేఖలు రాశారు. ఆ లేఖలోని వివరాలు… దేశరాజధాని న్యూఢిల్లీలో విఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తదితరులు ఎర్రబుగ్గ కారులు ఉపయోగించ కూడదని, అలాగే పెద్ద పెద్ద అధికార భవనాలు వారికి కేటాయించరాదని ఆ కోరారు. వీటితోపాటు విఐపిలకు కల్పిస్తున్న ప్రత్యేక భద్రతను తొలగించాలని వారికి సూచించారు.ముఖ్యమంత్రి కావడానికో, అధికారం కోసం తాము రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్‌ను 10 రోజుల సమయం కోరాను. ఆమ్‌ఆద్మీకి కాంగ్రెస్‌, బీజేపీ రెండు మద్దతిస్తామని చెబుతున్నాయి. మాకు ఎందుకు మద్దతిస్తారో ఆ రెండు పార్టీలు స్పష్టం చేయాలి. ఆమ్‌ఆద్మీ పార్టీకి బేషరతుగా మద్దతిస్తామని కాంగ్రెస్‌ గవర్నర్‌కు లేఖ ఇచ్చింది. కాంగ్రెస్‌ తీరు మమ్మల్ని విస్మయానికి గురి చేసింది. అంశాల వారీగా స్పష్టత ఇస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ విముఖత చూపడంతో గవర్నర్‌ మమ్మల్ని పిలిచారనిచెప్పారు. ఇదిలావుంటే తనకు పోలీస్‌ రక్షణ కల్పిస్తామన్న పోలీసు అదికారుల అభ్యర్థనను ఇప్పటికే కేజ్రీవాల్‌ తిరస్కరించారు.