సోనియా గాంధీకి అండగా ఉండాలి: ఎంపీ సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్ : యూపీఏ ప్రభుత్వాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడ్డ సోనియాగాంధీకి అండగా ఉండాల్సిన బాధ్యత తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌కు ఉందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పార్టీలు పక్కన పెట్టి కలిసికట్టుగా నడవాలని తెరాసకు విఙ్ఞప్తి చేశారు. వైఎస్ ముఖ్యమంత్రి కాకుంటే జగన్ ఎక్కడుండే వారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో లబ్దిపొందిన జగన్, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తిరుగుబాటు చేయటం ద్రోహం చేసినట్లేనన్నారు.