సీబీఐ, ఏసీబీలు ఇక స్వతంత్రం : కపిల్ సిబల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 17 (జనంసాక్షి) :
లోక్‌పాల్ బిల్లుతో సీబీఐ, ఏసీబీ వంటి సంస్థలు స్వతంత్రంగా వ్వవహరిస్తాయని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం అన్ని పార్టీల ఆమోదంతోనే సాధ్యమైందన్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని పార్టీలకు మరో మంత్రి కమల్‌నాథ్ ధన్యవాదాలు తెలిపారు. రేపు లోక్‌సభలో కూడా బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు కమల్‌నాథ్ పేర్కొన్నారు. లోక్‌సభలో కపిల్ సిబల్ మాట్లాడుతూ అవినీతిని నియంత్రించడానికి లోక్‌పాల్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు.