సీఎం కిరణ్‌ సర్కస్‌లో పులిలా మారారు: నరేంద్ర

హైదరాబాద్‌: రాష్రాన్ని సమైక్యంగా ఉంచుతానన్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కస్‌లో పులిలా మారారని సీమాంధ్ర తెదేపా ఆరోపించింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలా ఆడమని చెబితే… అలా ఆడుతున్నారని ఆపార్టీ శాసనసభ్యులు విమర్శించారు. విభజన బిల్లు గట్టెక్కించేందుకు సీమాంధ్రకు చెందిన 100 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కన్నతల్లికి ద్రోహం తలపెట్టిన వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సభలో రాష్ట్ర విభజన అంశాన్ని రహస్యఎజెండాగా చేసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.