చూయింగ్ గమ్ అతిగా నమిలినా పార్శ్వపు నొప్పి రావచ్చు!
ఇంటర్‌నెట్‌డెస్క్, హైదరాబాద్: చూయింగ్ గమ్‌ను అతిగా నమలడం ద్వారా టీనేజర్స్, చిన్న పిల్లల్లో పార్శ్వపు నొప్పి వచ్చే అవకాశముందని పరిశోధనలో తేలింది. జెరుసలేంలోని టెల్ అవివ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నాథన్ వాటెమ్‌బెర్గ్ చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. తలనొప్పికి, చూయింగ్ గమ్‌కు మధ్య ఎలాంటి సంబంధం ఉందనే విషయం పై తాము పరిశోధర జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. పార్శ్వపు నొప్పితో ఆస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువగా 6-19 సంవత్సరాల మధ్య వయసు వారే ఉంటున్నారన్నారు. పిల్లలు చూయింగ్‌గమ్ అతిగా నమలడం మానేస్తే ఈ సమస్యను అథిగమించవచ్చని ఆయన పేర్కొన్నారు.