దేవయాని స్థానంలో జయశంకర్
హైదరాబాద్ : అమెరికా భారత రాయబారిగా ఎన్. జయశంకర్ మంగళవారం వాషింగ్టన్ చేరుకుని బాధ్యతలు స్వాకరించనున్నారు. వీసా అవకతవకలకు సంబంధించి అక్కడ ఉన్న దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాదె ఆరోపణలు ఎదుర్కొనడం, అరెస్టు కావడం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సున్నితమైన స్థితికి చేరుకున్న సందర్భంలో జయశంకర్ కొత్త దౌత్యవేత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఇప్పటి వరకూ చైనాలో భారత రాయబారిగా సేవలందిస్తున్నారు.