తెలంగాణను ఆపడం ఎవరి తరం కాదు

మెదక్‌,జనవరి20: వచ్చిన తెలంగాణను ఆపడం ఎవరి తరమూ కాదని టిఆర్‌ఎస్‌  జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీలో కాలయాపన చేయడం ద్వారా బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాలయాపన చేసిన నేతలు ఇప్పుడు అదనపు సమయం కోసం పాకులాడుతున్నారని ఆయన మండిపడ్డారు.  కాంగ్రెస్‌, టిడిపిలు శాసనసభలో రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గడవులోపల బిల్లును ఢిల్లీకి పంపాలని కోరారు. చర్చ కొనసాగుతుండగా సభను ఇన్నిసార్లు వాయిదా వేయడం సరికాదని పేర్కొన్నారు. చర్చలో చంద్రబాబు పాల్గొనకపోవడాన్ని ఈ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టిడిపికి  స్థానం లేదని అన్నారు.