మెదక్ ఓయు పీజీ క్యాంపస్ ప్రారంభం
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మెదక్ జిల్లా జోగిపేటలో కొత్తగా పీజీ కళాశాల క్యాంపస్‌ను ప్రారంభించింది. ఈ క్యాంపస్ ద్వారా ఐదు పీజీ కోర్సులను ఈ విద్యాసంవత్సరం నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు ఉపకులపతి సత్యనారాయణ తెలిపారు. ఎంబీఏతో ఎం.ఎ.ఇంగ్లీషు, ఎమ్మెల్సీ ఆర్గాన్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ గణితం, ఎంఎల్‌ఐఎన్‌సి కోర్సులు ఇక్కడ ఉంటాయని ఆయన చెప్పారు. ఈ క్యాంపస్ అభివృద్ధికి రూ. 26.31 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు సత్యనారాయణ తెలిపారు.