అబద్దాలను ప్రచారం చేయడం తగదు

ఖమ్మం,జనవరి24: ముఖ్యమంత్రి కిరణ్‌కు చరిత్ర తెలియదని, అబద్ధాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని జిల్లా టిఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి వాస్తవాలను కప్పిపుచ్చుతూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం దౌర్భాగ్యకరమని అసెంబ్లీలో ప్రకటించడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలను తెలపడానికి శాసనసభకు మరో వారం పాటు గడువును రాష్ట్రపతి పొడిగించడంపై వీరు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లుపై చర్చకు రాష్ట్రపతి గడువును పెంచడం సమ్మతం కాదన్నారు. సీమాంద్రులు బిల్లుకు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా రాష్ట్ర విభజన తథ్యమని స్పష్టం చేశారు. సీమాంధ్ర పాలకులు నిజాంను మించిన నియంతలని ఆరోపించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రకటనలతో సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సంపూర్ణ తెలంగాణ సాధించడం కోసం అన్ని పార్టీలపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆంక్షలు లేని ప్రత్యేక రాష్టాన్న్రి సాధిస్తేనే తెలంగాణ ప్రజాప్రతినిధులకు సాదర స్వాగతం పలుకుతామని చెప్పారు. ముసాయిదా బిల్లుపై ఓటింగ్‌ జరగాలని సీమాంధ్ర ప్రతినిధులు కోరడం తెలంగాణ ప్రజలను అణచివేసే కుట్రలో భాగమేనని ఆరోపించారు. ముసాయిదా బిల్లులో 13 అంశాలలో అభ్యంతరాలు తెలిపామని, అందులో సమగ్ర మార్పులు జరగాలని ఇప్పటికే శాసన సభ్యులకు, ఎంపీలకు నివేదించామని తెలిపారు..