ఏకగ్రీవ గ్రామాల అభివృద్దికి అందని నిధులు
మహబూబ్‌నగర్,జనవరి24: ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానా ఇంతవరకు ఆయా పంచాయితీలకు చేరలేదు. ఎన్నికలు జరిగి ఐదు నెలలు అయినా ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నజరానా సొమ్ము గ్రామ పంచాయతీలకు విడుదల చేయలేదు. నిధులు రాకపోవడంతో ప్రజలకు ఇచ్చిన హావిూని నిలబెట్టలేక పోతున్నామని ఏకగ్రీవ గ్రామాల సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సౌకర్యం, డ్రైనేజీల నిర్మాణం వంటి పనులే కాక అంతర్గత రహదారుల మరమ్మతులు కూడా చేపట్టలేకపోతున్నామని అంటున్నారు. ఈ నిధుల కోసం ఏకగ్రీవమైన సర్పంచ్‌లు జిల్లా పంచాయతీ శాఖ అధికారులను కలిసి విన్నవించినా ఫలితం కన్పించడంలేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే గ్రామాలకు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు.జిల్లాలో 91 గ్రామ పంచాయతీ సర్పంచులు, 828 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామాల్లో మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేజర్ పంచాయతీలకు 7 లక్షలు, మైనర్ పంచాయతీలకు 5 లక్షల చొప్పున నజరానా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులను ఏక గ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నుంచి గ్రామానికి ప్రత్యేక ప్రోత్సాహకం వస్తుందని ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులతో గ్రామాన్ని అభివద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతో జిల్లాలో చాలా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కాని ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ నజరానాపై దష్టి పెట్టలేదు. ప్రభుత్వం నుంచి భారీగా నిధులు వస్తాయనే ఉద్దేశంతో పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వ తీరుతో చివరకు ఉత్తిచేతులే మిగిలాయని ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు.ఈ నిధులు గ్రామ అభివద్ధికి వినియోగించుకోవచ్చని గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి గ్రామ అభివద్ధి కోసం నిధులు వస్తాయనే ఆశతో ఒక్కతాటిపైకి వచ్చి గ్రామాలను ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ నిధులు మంజూరైతే గ్రామాల్లో అభివద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. ఈ నజరానాపై అ ధికారులకు కూడా స్పష్టమైన అవగాహన లేదు. గద్వాల డివిజన్‌లో 167 ఏకగ్రీవమైతే అందులో 17 పంచాయతీలు, 150 వార్డు సభ్యులు ఉన్నాయి. మహబూబ్‌నగర్ డివిజన్‌లో 23 సర్పంచు, 206 వార్డు సభ్యులు, నాగర్‌కర్నూల్ డివిజన్‌లో 155 పంచాయతీల్లో 15 సర్పంచులు, 140 వార్డు సభ్యులు, నారాయణపేట డివిజన్‌లో 202 గ్రామ పంచాయతీల్లో 20 స్పంచులు, 182 వార్డులు, వనపర్తి డివిజన్‌లో 166 పంచాయతీల్లో 16 సర్పంచులు, 150 వార్డుల్లో సభ్యులు ఏకగీవ్రమయ్యారు. గ్రామాలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానా ప్రకారం మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలకు సుమారు రూ.5.46 కో ట్లు రావాల్సి ఉన్నది.