సీఎం కుట్రను తిప్పి కొడతాం: డిప్యూటీ సీఎం
మెదక్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రలు తిప్పికొడతామని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తెలిపారు. సీఎం కిరణ్ ఒక ప్రాంతంపైనే ప్రేమ చూపిస్తున్నారు. కిరణ్ ఒక ప్రాంతానికి కాతు ఒక రాష్ట్రానికి సీఎం అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో సీఎం కిరణ్‌ను మా నాయకుడిగా భావించడం లేదన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నాం కాబట్టే సీఎం నాయకత్వంలో ఉన్నామని తెలిపారు. బిల్లుపై గడువు పెంచినా చర్చించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.