అభిప్రాయాలే కోరాం


ఓటింగ్‌ జరగలేదు
సీఎం తీర్మానానికి విలువ లేదు
కేబినెట్‌ ఆమోదిస్తుంది
పార్లమెంట్‌లో ప్రవేశపెడతాం : దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై కేవలం అభిప్రాయాలు మాత్రమే కోరామని, గురువారం అసెంబ్లీలో ముసాయిదాపై ఎలాంటి చర్చ జరగలేదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టం ముగిసిందని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభ చర్చను ముగించిన ఘటనపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లుపై శాసనసభ తన బాధ్యతను నిర్వహించిందని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై ఓటింగ్‌ జరగలేదని ఆయన అన్నారు.బిల్లుపై కేవలం అభిప్రాయాలు మాత్రమే కోరామని, బిల్లుపై ఓటింగ్‌ కోరలేదని స్పష్టం చేశారు. ఓటింగ్‌ జరిగింది సీఎం తీర్మానంపై మాత్రమేనని అన్నారు. బిల్లుపై సభలో ఓటింగు ఉండదని, అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే శాసనసభకు పంపించామని ఆయన చెప్పారు. సీమాంధ్రకు గానీ తెలంగాణకు గానీ చెందిన శాసనసభ్యులు తమ అభిప్రాయాలు చెప్పడానికి తాము అడ్డు పడలేదని ఆయన చెప్పారు. ఇది పార్టీ ఉల్లంఘనల కిందకు రాదన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించిన తీర్మానం రాష్ట్ర విభజనపై ఏ విధమైన ప్రభావం చూపదని ఆయన అన్నారు. రాజ్యాంగ అవసరం దృష్ట్యానే బిల్లును శాసనసభకు పంపించినట్లు ఆయన తెలిపారు. మంత్రివర్గ సమావేశం తర్వాత తెలంగాణ ముసాయిదా బిల్లు పార్లమెంటుకు వెళ్తుందని ఆయన చెప్పారు. బిల్లులో సవరణలపై కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే పార్టీలు గతంలో తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చినవేనని ఆయన అన్నారు. అందరూ లిఖితపూర్వకంగా తమ అనుకూలతను తెలిపారని, అఖిలపక్ష సమావేశాల్లోనూ ఇదే అభిప్రాయం చెప్పారని అన్నారు. ఆ తరవాతనే కాంగ్రెస్‌ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తసీఉకున్నదన్న విషయాన్ని మరోమారు గుర్తు చేశారు. అందుకే తెలంగాణ బిల్లుపై ఓటింగ్‌ ఉండదని…అభిప్రాయం చెప్పడానికే బిల్లును అసెంబ్లీకి పంపామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు పక్రియలో కీలక ఘట్టం ముగిసిందని, బిల్లుపై శాసనసభ తన బాధ్యతను నిర్వహించిందని చెప్పారు. శాసనసభలో సీఎం తీర్మానం రాష్ట్ర విభజనపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుపై శాసనసభలో ఓటింగ్‌ జరగలేదని దిగ్విజయ్‌ తెలిపారు. శాసనసభలో సీఎం తీర్మానం రాష్ట్ర విభజనపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. . రాజ్యాంగ అవసరం దృష్ట్యానే శాసనసభ అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు పెడతుందన్నారు. సవరణలపై కేబినెట్‌ చర్చించి మంచి సలహాలుంటే బిల్లులో పొందుపరుస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ రేసులో ఇద్దరు రెబల్‌ అభ్యర్థులు ఉన్నారని అన్నారు. వారిని విరమించుకునేలా చేస్తామని అన్నారు.