75మీటర్ల మువ్వన్నెల జాతీయజెండాతో తీరంగా ర్యాలీ.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి,ప్రతి ఇంటా స్వాతంత్ర స్ఫూర్తి రగలాలి.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.
తాండూరు అగస్టు 10(జనంసాక్షి)అఖండ భారతావనికి స్వాతంత్రం సిద్ధించి 75వసంతాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల సంబరాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం తాండూరు పట్టణ పురవీధుల్లో 75మీటర్ల పొడవాటి తీరంగా జెండాతో భద్రేశ్వర దేవాలయం నుండి ఇందిరాచౌక్ మీదుగా అంబెడ్కర్ చౌరస్తా వరకు తీరంగా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ .పట్లోళ్ల దీప నర్సింలు పాల్గొన్నారు. అనంతరం భరత్ మాత కి జై అనే నినాదాలతో ర్యాలీ నిర్వహిస్తూ పట్టణ వ్యాపారస్తులకు జాతీయజెండాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ..కోట్ల మంది త్యాగాలు, పోరాటాలతో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన భారతావని చరిత్రను నేటి తరాలకు తెలియజేయల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రెండు వారాలపాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.మన భారత దేశంలో అనేక కులాలు అనేక మతాలు,అనేక జాతులు వారు అనేక భాషల్లో మాట్లాడేవారు ఉన్నారని అందరూ సోదర సమైక్యభావంతో జీవిస్తున్నారని అందరికీ మన జాతీయ మూడు రంగుల జెండాను అందరూ గౌరవిస్తూ హర్ ఘర్ తిరంగా’ అంటే ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగర వెయ్యాలని ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటుకోవాలని అన్నారు.వజ్రోత్సవాల సంబరాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని,ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకోవాలని,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు,నాయకులు,విద్యార్థు లు,యువకులు,మెఫ్మా అర్పిలు,ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.