దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌ : దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భూపతి తేజను అదుపులోకి తీసుకున్నారు. లవ్‌టుడూ, జయం మనదేరా సినిమాలకు భూపతితేజ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నిందితుడి నుంచి రూ. 3.31 లక్షల విలువైన నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.