బేగంపేట నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ
హైదరాబాద్: తెలంగాణ విజయోత్సవర్యాలీ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమైంది. ప్రత్యేక వాహనం కేసీఆర్, కేకే, వివేక్, మందా జగన్నాథం గన్‌పార్కుకు ర్యాలీగా బయలుదేరారు. లక్ష అభిమానులు ఉద్యమనేతకు స్వాగతం పలికి భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అంతా ఆటా-పాటా, డప్పులు, తీన్‌మార్ స్టెప్పులతో ర్యాలీ కొనసాగుతోంది. ఒంటెలు, గుర్రాలు, బతుకమ్మలు, బోణాలతో ధూంధాంగా ర్యాలీగా తరలి వెళ్లారు.