సీమాంధ్రను ప్రభుత్వం అనాథగా చేసింది : మోడీ

న్యూఢిల్లీ : కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సీమాంధ్రను అనాథగా చేసిందని బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. తెలంగాణ వచ్చింది వందలాది అమరవీరుల త్యాగాల వల్లేనని తెలిపారు. సీమాంధ్రలో ఒక్క ఓటు కూడా పడదని కాంగ్రెస్‌కు తెలుసన్నారు. అందుకే సీమాంధ్ర ప్రాంతాన్ని కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌ పాపాలే ఆ పార్టీని తుడిచిపెడతాయని పేర్కొన్నారు. డెలివరీ చేయడం చేతగాని కాంగ్రెస్‌ తల్లిని, పిల్లను చంపేసిందని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయ కోసమే ఏపీని కాంగ్రెస్‌ విభజించిందని విమర్శించారు. రెండు ప్రాంతాలకు మేం న్యాయం చేద్దామనుకున్నామని తెలిపారు.