కూసిన ఎన్నికల కోడ్ మోగిన మున్సిపల్ నగారా
10 నుంచి నామినేషన్లు
30న పోలింగ్
ఏప్రిల్ 2న ఫలితాలు
హైదరాబాద్, మార్చి3 (జనంసాక్షి): ఎన్నాళ్ల నుంచో పెండింగ్‌లో పడుతూ చివరకు సుప్రీం జోక్యంతో మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఈ నెల 30న ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రామాకాంత్ రెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో ఎట్టకేలకు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 30వ తేదీన ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెల్లడిస్తారు. అవసరమైతే 1న రీపోలింగ్ జరుపుతారు. ప్రచార ఖర్చు మునిసిపాలిటీలకు లక్ష, కార్పొరేషన్లకు లక్షన్నర పరిమితిగా విధించారు. దీంతో రాష్ట్రంలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఈరోజు ప్రకటించారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. విద్యార్థుల పరీక్షల దృష్ట్యా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఆదివారం 30న నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ఆయన విడుదల చేసిన సందర్భంగా ఈ విషయం స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు కోటి మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. బుద్ధభవన్‌లో రమాకాంత్‌రెడ్డి విూడియా సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల వివరాలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీల ప్రాతిపాదికనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10 నగరపాలక సంస్థలు, 146 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మార్చి 10 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించారు. కార్పోరేషన్లలో మార్చి 10 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అలాగే మున్సిపాలిటీల్లో మార్చి 10 నుంచి 14 వరకు నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 14గా నిర్ణయించారు. మార్చి 15న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 18గా నిర్ణయించారు. మార్చి 30న ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరిపి ఆ రోజే ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించబోతున్నారు. పార్టీ గుర్తులపైనే జరిగే ఈ ఎన్నికలలో మొత్తం 11వేల ఈవీఎంలు ఉపయోగిస్తారు. ఏదో కారణంతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయని, ఈ విషయంలో హైకోర్టు సీరియస్ అయ్యిందని ఆయన చెప్పారు. ఎన్నికల ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు తమకు డెడ్ లైన్ విధించిందని, అందుకే త్వరగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 7న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహిస్తామని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల కోడ్ వర్తింపు, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ అంశాలపై అధికారులతో చర్చించారు. ఆ తరువాత మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సాధారణ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో సెవిూఫైనల్ సమరానికి తెరలేచింది. హైకోర్టు, సుప్రీంకోర్టులు మొట్టికాయలు వేయడంతో.. మూడున్నరేళ్లుగా నిలిచిపోయిన పురపాలక ఎన్నికలకు సోమవారం అధికారికంగా కమిషనర్ ప్రకటన చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లపై కసరత్తు పూర్తి చేసింది. శనివారం రాత్రికే ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడం, సోమవారం ఉదయమే హైకోర్టులో పుర ఎన్నికల పిటిషన్ విచారణకు రానుండటంతో, ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలు పక్రియను దాదాపు పూర్తి చేసింది.. వీటిని పరిశీలించిన కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించి సలహాలు తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై చర్చించారు. పుర ఎన్నికల పక్రియను పూర్తి చేసేందుకు 35రోజుల సమయం సరిపోతుందని నిర్ణయించారు. సోమవారం షెడ్యూలు ప్రకటిస్తే ఏప్రిల్ తొలి వారానికి ఎన్నికలు పూర్తిచేయాలని భావిస్తోంది. మరోవైపు సాధారణ ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది.మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు ఉదయం వెలువడడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ వారాంతంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో ఒకేసారి రెండు కోడ్‌లు అమల్లో ఉండనున్నాయి. పుర ఎన్నికల తరువాత సాధారణ ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాంగం, సిబ్బంది సమాయత్తమయ్యేందుకు కనీసం 15 రోజుల సమయం సరిపోతుందని భావిస్తున్నారు. రెండు ఎన్నికలకు మధ్య కేంద్ర ఎన్నికల సంఘం కొంత సమయం ఉండేలా చూడాలని కోరినట్లు తెలిసింది. సాధారణ ఎన్నికలు జరిగే నాటికి పురపాలక ఎన్నికలు పూర్తిచేసి, పాలక మండళ్లు ఏర్పాటు చేసేలా షెడ్యూలు రూపొందించారు. సోమవారం ఉదయం 10 గంటలకు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ విచారణకు రానుంది. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి విూడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించడంతో పాటు షెడ్యూల్ ప్రకటించారు.సాధారణ ఎన్నికలకు, పురఎన్నికలతో ఎలాంటి ఇబ్బందిలేదని చెప్పారు. కేంద్ర ఎన్నికలకమిషన్ సాధారణ ఎన్నికల పక్రియ చూస్తుందని, రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక బాధ్యతలు నిర్వహిస్తుందన్నారు. ఈ ఎన్నికలకు కోడ్ ఒకే విధంగా ఉంటుందన్నారు. రిజర్వేషన్ల ప్రకటన తమకు సకాలంలో అందకపోవడం వల్ల ఇంతకాలం ఎన్నికలు నిర్వహించలేకపోయామన్నారు.