వడగళ్ల వానతో పది జిల్లాల్లో నష్టం : ప్రభుత్వం
హైదరాబాద్ : రాష్ట్రంలోని పది జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భారీ వడగళ్ల వానతో పది జిల్లాల్లో మొత్తం 72,669 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని అధికారులు వెల్లడించారు. మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జల్లాల్లో వరి, మొక్కజొన్న పంటకు తీవ్రనష్టం జరిగిందని పేర్కొన్నారు.