ప్రతి దళిత కుటుంబానికిమూడెకరాల భూమి
టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్
హైదరాబాద్, మార్చి 7 : అధికారంలోకి రాగానే ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి అందించ నున్నట్టు టిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మహబూబాబాద్‌కు చెందిన టీడీపీ నేతలు కొందరు శుక్రవారం సాయంత్రం తెలంగాణాభవన్‌లో కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తరువాత కెసిఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లను గెలుచుకుందాం. 17మంది ఎంపీలు గెలిస్తేనే కేంద్రంతో కొట్లాడి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక అనుమతులు తెచ్చుకోవచ్చని అన్నారు. 17 మంది ఎంపీలు గెలవాల్సిందేనని అన్నారు. గిరిజనులకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని అన్నారు. చిరంజీవి పని అయిపోయింది.. ఇక ఆయన తమ్ముడు పవన్ వస్తాడంట. సీమాంధ్రుల కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గిరిజనుల తలరాతలు మారుస్తామని అన్నారు. తెలంగాణా వచ్చింది గాని.. సంపూర్ణ తెలంగాణా రాలేదని చెప్పారు. సంపూర్ణ తెలంగాణా సాధించుకునేంతవరకు అప్రమత్తంగా ఉందామని సూచించారు.