పవన్‌కల్యాణ్ వస్తే ఆహ్వానిస్తాం: జేపీ
ఖమ్మం,మార్చి8: సినీ కథానాయకుడు పవన్‌కల్యాణ్ లోక్‌సత్తా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ మరోమారు ఆఫర్ ఇచ్చారు. గతంలో పవన్ వస్తే పగ్గాలు అప్పగిస్తామన్న జెపి మళ్లీ అదే ప్రతిపాదన చేశారు. ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రాజకీయ పార్టీలు వ్యాపార ధోరణి విడనాడాలని అన్నారు. అన్ని ప్రధాన పార్టీలు కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఏర్పడే ఏ ప్రభుత్వమైనా, నిర్థిష్ట విధానాన్ని అమలు చేయాలని, లోక్‌సత్తా పార్టీ రెండు రాష్టాల్రోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. తాము నిజాయితీ రాజకీయాలకు విలువనిస్తామని అన్నారు. గత కొన్నాళ్లుగా తాము చేస్తున్న కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు.