దోపిడీదారులకు అవకాశం ఇవ్వొద్దు : నారాయణ

హైదరాబాద్‌ : ఈ ఎన్నికల్లో దోపిడీదారులు, దొంగలకు అవకాశం లేకుండా చూడాలని, వారికి ప్రజలు అవకాశం ఇవ్వొద్దని సీపీఐ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. తెలంగాణకుసంబంధం లేనివారు కూడా తామే తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసి లాఠీ దెబ్బలు తిన్న మేమేమనాలని ప్రశ్నించారు. విభజన సరిగా జరగకే రెండు ప్రాంతాల్లోనూ ఆందోళన కొనసాగుతోందన్నారు.