మునిస’ిపోల్స్’కు నేటి నుంచి నామినేషన్లు
హైదరాబాద్, మార్చి 9 (జనంసాక్షి) :
మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు తెరలేచింది. సోమవారం నుంచి ఆశావహులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు. సోమవారం ఉదయం రిటర్నింగ్ అధికారులు మునిసిపాలిటీల వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభవమవుతుంది. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఈనెల 13 వరకు నగర పంచాయతీల్లో 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 15న నామినేషన్లను పరిశీలించి సక్రమంగా లేని వాటిని తిరస్కరిస్తారు. నామినేషన్ల ఉప సంహరణకు 18 వరకు గడువు ఉంటుంది. అదే రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను, గుర్తులను ప్రకటిస్తారు. ఈనెల 30న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈనెల 28 సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ ఒకటిన రీపోలింగ్ నిర్వహించి రెండున ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మేయర్లు, చైర్మన్లు, చైర్‌పర్సన్ ఏప్రిల్ ఏడున ఉదయం 11 గంటలకు నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ 11 వేల ఈవీఎంలను సిద్ధం చేసింది. 49,583 మంది సిబందిని ఎన్నికల నిర్వహణలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 146 మునిసిపాలిటీలు, పది కార్పొరేషన్‌లలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.