కాపీయింగ్‌ జరగకుండా పటిష్టంగా పరీక్ష నిర్వహించాలి

గుంటూరు, మార్చి 15  : పరీక్షల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని హైటెక్‌విధానంలో కాపీయింగ్‌లకు పాల్పడే అవకాశాలుంటాయని అదనపు సంయుక్త కలెక్టర్‌ నాగేశ్వరరావు అన్నారు. అభ్యర్థులు కేంద్రంలోకి అడుగుపెట్టే సమయం నుంచి వారు పరీక్ష పూర్తి చేసేంత వరకు గట్టి నిఘాను ఉంచడం ద్వారా చూచిరాతలు, హైటెక్‌మోసాలను అరికట్టవచ్చని చెప్పారు. ఈ నెల 16వతేదీ జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష కేంద్రాల శాఖపరమైన అధికారులు ముఖ్య పర్యవేక్షకుల సమావేశం నగర పాలెంలోని స్టాల్‌ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఏజెసి నాగేశ్వరరావు మాట్లాడుతు నిర్దేశించిన సమయం కంటే నిమిషం ఆలస్యం వచ్చినా అభ్యర్థులను పరీక్షకు అనుమతించవద్దన్నారు. నిర్దేశించిన సమయానికి అరగంట ముందుగానే కేంద్రాల్లోనికి అనుమతించాలన్నారు. సెల్‌ఫోన్లు, బ్లూటూట్‌తు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకువెళ్ళకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష రో జున విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా ఇప్పటికే విద్యుత్‌ శాఖ  అధికారులు ఆదేశాలిచ్చామన్నారు. డీఈవో ఆంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 16 వతేదీ ఉదయం 9కేందాల్లో పేపర్‌-1 మధ్యాహ్నాం 77కేంద్రాల్లో పేపర్‌-2 పరీక్షలు జరుగుతాయన్నారు. పేపర్‌-1కు 2,044మంది, పేపర్‌-2కు 17,452మంది చొప్పున మొత్తం 19,496మంది టెట్‌ రాయనున్నారని వివరించారు. సమావేశంలో భాగంగా సీఎస్‌లు, డీవోలకు పరీక్షల సామాగ్రిని పంపిణీ చేశారు. పాఠశాల విద్యాసంయుక్త సంచాలకురాలు పి.పార్వతి, ఆర్వి ఎం పథక అధికార టీ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.