అటకెక్కిన చెట్టు పట్టా పథకం
ఖమ్మం, మార్చి 15 : పర్యావరణాన్ని పెంపొందించడంతో ఆపటు బాటసారులకు నీడ కల్పించేఉద్దేశంతో 1987లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చెట్టుపట్టా పథకాన్ని ప్రవేశపెట్టారు. రోడ్డు వెంబడి రహదారికి ఇరువైపులా 20 నుండి 30చోట్లతో ఒక లబ్దిదారునికి చెందేలా పట్టా పంపణీ చేశారు. ఈ పథకం కింద మామిడి చెట్లను లబ్దిదారులు నాటుకున్నారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతతోపాటు వాటి ఫలసాయం వారికే చెందేలా పథకం రూపొందించి పట్టాలు పంపిణీ చేశారు. వందలాది నిరుపేదలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరింది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత పరికించి చూస్తే ఈ చెట్ల ద్వారా ప్రతి లబ్దిదారులు రూ.5నుండి రూ.15వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. ఇదే విషయమై దమ్మపేట మండలంలో అక్కినేపల్లికి చెందిన రైతు పొత్న మాట్లాడుతూ తమ సొంతానికి సరిపడ కాయలు లభించడమే కాక పేదలకు ఆదాయం లభించే ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని లబ్దిదారులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.