వారేవ్వా! వరంగల్‌


అమీర్‌ఖాన్‌ ప్రశంస
వరంగల్‌, మార్చి 17 (జనంసాక్షి) :
కాకతీయుల కీర్తికిరీటం మనం వరం గల్‌కు మరో వ్యక్తి నుంచి అపూర్వ ప్రశం స లభించింది. బాలివుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరే షన్‌ను అభినందించారు. దేశం ఎదు ర్కొంటున్న శిశు మరణాలు, అత్యాచార ఘటనల సమస్యలను ఎత్తి చూపుతూ.. ప్రజలకు సత్యమేవ జయతే టెలివిజన్‌ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ప్రసారమైన సత్యమేవ జయతే కార్యక్రమంలో చెత్త చెదారాన్ని శుభ్రం చేయడంపై.. మున్సిపల్‌ కార్పోరేషన్‌ నిర్లక్ష్య విధానాలను, నిధుల దుర్విని యో గం తదితర అంశాలను అమీర్‌ ఖాన్‌ ప్రస్తావించారు. చెత్తను సద్వినియోగం చేయడంతో పాటు, రీసైక్లింగ్‌ల కారణంగా ఆదాయం కూడా దక్కుతోంది. చెత్త చెదారాన్ని డంపింగ్‌ యార్డుల్లో కాల్చడం వల్ల వచ్చే చర్మ సమస్యలపై, అనారోగ్య సమస్యలపై సంబంధిత పలువురు నిపుణులతో మాట్లాడించారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని వరంగల్‌ కార్పొరేషన్‌ సాధించిన విజయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. ఏడు రోజుల్లో వరంగల్‌ నగరాన్ని శుభ్రపరిచడమే కాకుండా చెత్త చెదారాన్ని రీసైక్లింగ్‌ చేస్తూ మున్సిపాలిటీకి రెవెన్యూ తెచ్చిపెట్టేలా కృషి చేసిన డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ బి జనార్దన్‌ రెడ్డి, ఐఏఎస్‌ అధికారి వివేక్‌ యాదవ్‌ల సేవలను ప్రశంసించారు. పరిశుభ్రమైన నగరంగా చేయడానికి తాము తీసుకున్న చర్యలను, ప్రణాళికలను బి జనార్దన్‌ రెడ్డి, వివేక్‌ యాదవ్‌ ఈ కార్యక్రమంలో వెల్లడించారు. వరంగల్‌ పట్టణాన్ని క్లీన్‌ సిటీగా మార్చిన ఇద్దరు అధికారులను అమీర్‌ ఖాన్‌ ప్రశంసలతో ముంచెత్తారు.