త్రిపురా పాఠ్యాంశాల్లో


భాజపా మతతత్వ పార్టీ అగర్తలా, మార్చి 17 (జనంసాక్షి) :
వామపక్ష కూటమి అధికారం లో ఉన్న త్రిపుర రాష్ట్ర పాఠ్య పుస్తకాల్లో భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా పేర్కొ న్నారు. తొమ్మిదో తరగతి రాజ నీతి శాస్త్ర పాఠ్యపుస్తకంలో తమ పార్టీని మతతత్వ పార్టీగా చూపారంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసి నివేదిక అందించాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అశుతోష్‌ జిందాల్‌ విద్యాశాఖ ముఖ్య అధికారులను ఆదేశించారు. నివేదిక అందగానే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని ఆయన చెప్పారు. బెంగాలీ మీడియంలో ఉన్న పాఠ్య పుస్తకంలోని ‘ఇండియాస్‌ పార్టీ సిస్టం’ పాఠంలో మతతత్వ పార్టీలోని ఉనికిని ఈ వ్యవస్థలోని ముఖ్యమైన లక్షణాలు తమ పార్టీని చూపారని బీజేపీ మేధావుల విభాగం కన్వీనర్‌ ప్రసేన్‌జిత్‌ చక్రవర్తి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వీఎస్‌ సంపత్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీతో పాటు ముస్లింలీగ్‌, హిందూ మహాసభ, శివసేన తదితర పార్టీలు మత ప్రాతిపదికన ఏర్పడినవి కానప్పటికీ మతవాద రాజకీయాల ద్వారా అధికారాన్ని చేపట్టడంలో విజయవంతమైనట్లుగా ఆ పాఠంలో పేర్కొన్నారు. అంతేగాక కాంగ్రెస్‌, సీపీఎం, బీజేపీ, బీఎస్పీ పార్టీల్లో ఏది మతతత్వ పార్టీయో గుర్తించాలని ఇటీవల నిర్వహించిన పబ్లిక్‌ పరీక్షల్లో ప్రశ్న కూడా ఇచ్చారని చక్రవర్తి తెలిపారు.