కేంద్ర రాష్ట్ర బృందంపై రైతుల అగ్రహం

కేంద్ర రాష్ట్ర బృందంపై రైతుల అగ్రహం
తెనాలి మారీన్‌పేట: లెహర్‌, హెలెన్‌ తుఫాన్‌ల ప్రభావంతో పంట నష్టపోయిన ప్రాంతాల్లో నష్టం అంచానావేసేందుకు కేంద్ర పరిశీలిన బృందం గురువారం తెనాలి నియోజకవర్గంలో పర్యటించింది. ఢీల్లీ నుంచి వచ్చిన ఆర్పీసింగ్‌ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన బృందం తెనాలి నియోజకవర్గంలోని నేలపాడు, కొల్లిపర మండలంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పంట నష్టం ఫోటోలను వారు తిలకించారు. నష్టం జరిగిన ఆరునెలల తర్వాత కేంద్ర బృందం పర్యటించడంపై స్ధానిక రైతులు, తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బృందాన్ని తెదేపా మాజీ మంత్రి రాజేంద్రప్రసాద్‌ నిలదీశారు.