మలేషియా విమాన శకలాల గాలింపులో అవరోధాలు

మలేషియా విమాన శకలాల గాలింపులో అవరోధాలు
కౌలాలంపూర్‌: ఈనెల 8న అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్‌ విమానం దక్షిణ హిందూ మహాసముద్రమంలో కుప్పకూలి జలసమాధి అయిందని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దక్షిణ హిందూ మహాసముద్రంలో విమానశకలాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో గాలింపుకు ఆటంకమేర్పడుతోందని, ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపును ఒకరోజు నిలిపివేసున్నట్లు మలేషియా అధికారులు వెల్లడించారు. మలేషియా విమానం మృతుల్లో ఎక్కువ మంది చైనీయులు ఉన్నారు. విమాన ప్రమాదంపై చైనా ప్రత్యేక దృష్టి సారించింది. బ్రిటన్‌కు చెందిన ఇన్మార్‌ శాట్‌ ఉపగ్రహం వెల్లడించిన ఆధారాలు బయటపెట్టాలని చైనావిదేశాంగ శాఖా మంత్రి యాంగ్‌షింగ్‌ మలేషియా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.