ఉద్యమ ద్రోహులను ఓడించండి
కొండా సురేఖ, జగ్గారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి తెలంగాణ ద్రోహులే
టీఆర్‌ఎస్ వైఖరిపై జేఏసీ అసహనం
ఎన్నికల ఎజెండా విడుదల చేసిన కోదండరామ్
హైదరాబాద్, మార్చి 30 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమ ద్రోహులను ఓడించాలని టీ జేఏసీ పిలుపునిచ్చింది. కొండా సురేఖ, జగ్గారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి ఉద్యమ ద్రోహులేనని తేల్చిచెప్పింది. కొండా దంపతులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఒంటెత్తు పోకడలు పోతున్న టీఆర్‌ఎస్ వైఖరిపై జేఏసీ అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ రాజకీయ ఐకాస అజెండాను ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆదివారం విడుదల చేశారు. అజెండా అంశాలను పార్టీల మేనిఫెస్టోల్లో చేర్చాలని కోరతామని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్థూపాలు ఏర్పాటు చేయాలని, గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తించాలని కోరారు. 1956 తర్వాత భూపందేరంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ద్రోహులు పోటీ చేస్తే ప్రోత్సహించొద్దని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. ఆయా పార్టీలు ఉద్యమ ద్రోహులకు టికెట్లు ఇవ్వడం సరికాదన్నారు. అలాంటి వారికి నాయకత్వం అప్పగిస్తే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషి చేసిన టీ జేఏసీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓ మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు వివరిస్తూ ప్రతి రంగంలో తెలంగాణ వారికి న్యాయం జరగాలన్నారు. తెలంగాణ సచివాలయంలో ఇక్కడి ఉద్యోగులే ఉండాలి. ప్రాణహిత – చేవెళ్లకు జాతీయ ¬దా కల్పించాలన్నారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలి. వ్యవసాయానికి 12 గంటలు కరెంట్ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. మొత్తం 16 అంశాలపై అజెండా రూపొందించారు. ఎజెండా అంశాలను పార్టీల మేనిఫెస్టోల్లో చేర్చాలని కోరతామని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్థూపాలు ఏర్పాటు చేయాలని, గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తించాలని కోరారు. 1956 తర్వాత భూపందేరంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో రఘు, విఠల్ తదితరులు పాల్గొన్నారు.