రెండు రాష్ట్రాలకూ జూన్‌ నాటికే ప్రత్యేక బడ్జెట్‌


విభజనపై ఉన్నతాధికారులతో గవర్నర్‌ సమీక్ష
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) :
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు జూన్‌ నాటికి ప్రత్యేక బడ్జెట్‌లు ఆమోదిస్తామని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తెలిపారు. ఏప్రిల్‌, మే నెలలకు రాష్ట్ర ఉమ్మడి బడ్జెట్‌ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 25 వరకే ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌ వర్తిస్తుంది. జూన్‌ రెండో తేదీ నుంచి రెండు రాష్ట్రాలకు విడివిడిగా బడ్జెట్‌ ఉండనుంది. కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డ తరవాత బడ్జెట్‌ ప్రవేశపటెట్‌ఇ ఆమోదిస్తాయి. పోలీసుశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. పోలీస్‌శాఖ విభజనపై గవర్నర్‌ నేతృత్వంలో సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ, సీఎస్‌ పీకే మహంతి, పోలీసులు ఉన్నతాధికారులతో పాటు పలువురు హాజరయ్యారు. పోలీస్‌శాఖలో సిబ్బంది సంఖ్య, విభజన అనంతరం ఇరు ప్రాంతాలకు పోలీసుల వినియోగంపై ఓ నివేదికను గవర్నర్‌కు ¬ంశాఖ సెక్రటరీ సీపీ దాసు అందజేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన పక్రియ వేగవంతమవుతున్న తరుణంలో వివిధ శాఖల విభజనపై గవర్నర్‌ దృష్టి సారించిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ సచివాలయం రెండుగా విడిపోయింది. ఈమేరకు ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధప్రదేశ్‌ సీఎం కోసం సౌత్‌ హెచ్‌ బ్లాక్‌ కేటాయించారు. సౌత్‌ హెచ్‌ బ్లాక్‌లో ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సీఎం కోసం సి-బ్లాక్‌ కేటాయించారు. మిగతా ఏ, బీ, డీ బ్లాక్‌లు తెలంగాణకు కేటాయించారు. జే, కే, ఎల్‌ బ్లాకులతోపాటు నార్త్‌ హెచ్‌ బ్లాకును ఏపీకి కేటాయించారు. సచివాలయం ఓల్డ్‌ గేటును తెలంగాణకు, న్యూగేటును ఏపీకి కేటాయించారు. సచివాలయంలోని డీ-బ్లాక్‌లో గవర్నర్‌ సలహాదారులకు ఛాంబర్లు కేటాయించారు. ఈమేరకు గవర్నర్‌ సలహాదారులు బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.