టీఆర్‌ఎస్‌ రెండో జాబితా విడుదల

హైదరాబాద్‌:టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ శనివారం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఏడు లోక్‌సభ స్థానాలకు, 4 అసెంబ్లీ స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు.
టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. తెలంగాణా భవన్‌లో శనివారం మధ్యాహ్నం ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఏడు లోక్‌సభ స్థానాలకు, నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మహబూబ్‌నగర్‌-జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూలు- మందా జగన్నాథం, వరంగల్‌-కడియం శ్రీహరి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్‌, నల్గొండ- పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కరీంనగర్‌ – బి.వినోద్‌కుమార్‌, చేవేళ్ళ- కొండా విశ్వేశ్వరరెడ్డి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. షాద్‌నగర్‌ నుండి వై.అంజయ్య యాదవ్‌, కోదాడ నుండి కె.శశిధర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి నుండి కనకారెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ నుండి గోవర్ధన్‌ అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.