ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్‌ఫేజ్ పోలింగ్: సీఈవో
హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఫస్ట్‌ఫేజ్ పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఇవాళ ఎన్నికలు జరిగిన తీరును వివరించేందుకు బుద్దభవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కొన్ని చెదురుమదురు సంఘటలను మినహా మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు. ఉదయం, సాయంత్రం పోలింగ్ ఎక్కువగా నమోదైందని పేర్కొన్నారు. ఎండవల్ల మధ్యాహ్నం పోలింగ్ తగ్గిందని వివరించారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య గొడవలు జరిగాయని తెలిపారు. అనంతపురం, మెదక్, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల రిపోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తానికి 80 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు.