టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రేపు విడుదల
న్యూఢిల్లీ: అధిష్ఠానం పెద్దలు సోనియా ఎన్నికల ప్రచారంలో ఉండటం, జాబితాపై సంతకం చేయాల్సిన ఆస్కార్ ఫెర్నాండెజ్ ఢిల్లీలో అందుబాటులో లేకపోవడం, దిగ్విజయ్‌సింగ్ కూడా రాజధానిలో లేకపోవడంతో జాబితా రేపు విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలపై గొంతు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ అభ్యర్థుల జాబితా విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. టికెట్లు ఆశిస్తున్న ఆశావహులంతా ఎంతో ఉద్వేగంతో ఎదురుచూస్తున్నారు.